అత్యంత విలువైన జట్టుగా SRH

by Shyam |
అత్యంత విలువైన జట్టుగా SRH
X

ముంబయి: వచ్చే నెల 18న చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మినీ వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్స్‌ను అలాగే అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీలు, అంతగా ఆకట్టుకోని ఆటగాళ్లను మాత్రం విడుదల చేశాయి. వీటిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయగా, సన్‌రైజర్స్ జట్టు అందరికన్నా తక్కువగా ఐదుగురిని మాత్రమే వదిలేసుకుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఈ సీజన్‌లోనూ ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ రూ.85కోట్లకు మించరాదు.

అంటే, జట్టులో ఉండే మొత్తం ఆటగాళ్ల విలువ రూ.85 కోట్ల కన్నా ఎక్కువ ఉండరాదు. దీంతో ఫ్రాంచైజీలు అంతగా రాణించని ఆటగాళ్లను విడుదల చేసి, తమ పర్స్ వాల్యూను పెంచుకున్నాయి. ఇలా మిగిల్చుకున్న అమౌంట్‌తో వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోనున్నాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువమంది ఆటగాళ్లను విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ జట్టు పర్స్ వాల్యూ అత్యల్పంగా రూ.10.75 కోట్లుగా ఉంది.

కానీ, వేలానికి ముందు, ఫ్రాంచైజీలన్నింటిలోనూ సన్‌రైజర్స్ జట్టే అత్యంత విలువైన టీమ్‌గా ఉంది. ఈ ఫ్రాంచైజీ రూ.75.5 కోట్ల విలువైన ఆటగాళ్లను కలిగి తొలి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.74.4 కోట్లు), ముంబయి ఇండియన్స్ (రూ.73.85), ఢిల్లీ క్యాపిటల్స్(రూ.67.4 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ.62.1 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(రూ.51.9 కోట్లు), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.51.6 కోట్లు), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (రూ.30 కోట్లు) జట్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed