- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గింత మంచి బిల్డింగ్ ఉత్తగున్నదా..?
దిశ, ఆదిలాబాద్: ‘జిల్లాలో ప్రస్తుతమున్న మున్సిపాలిటీ బిల్డింగ్ పాత పడ్డది. కొత్తది ఎప్పుడో కట్టిండ్రు. అది ఉపయోగంలో లేకపోవడం బాధాకరం. ఈ కొత్త బిల్డింగ్‌ను రూ.75 లక్షలతో మంచిగా చేసుకుందాం. అందులోకి మున్సిపల్ కార్యాలయాన్ని మార్చుకుందాం’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆయన పట్టణంలో శుక్రవారం పర్యటించారు. ఇందులో భాగంగా ఎనిమిదేండ్ల క్రితం నిర్మించిన నూతన మున్సిపల్ భవనంలోకి వెళ్లారు. నిధులు లేక ఆ భవనం ఇంకా పూర్తి కాలేదు. అయితే, గత ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి.. ఈ భవనం ఉన్న విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. ఇన్నేండ్లకు ఇప్పుడు ‘అరే..ఇంత మంచి భవనం వృధాగా ఉండడం ఏమిటి..? దీనికి 75 లక్షలు ఖర్చు చేస్తే అందుబాటులోకి వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఇదే పని ఐదేండ్ల క్రితమే చేసుంటే, రూ.30 లక్షల లోపు నిధులతో పూర్తై ఉండేది కదా అంటూ.. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పాల్గొన్నవారు గుసగుసలాడుకోవడం కనిపించింది.