- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్టోబర్‌లో తగ్గిన ఎగుమతులు
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో అక్టోబర్‌లో ఎగుమతులు 5.12 శాతం క్షీణించాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో సానుకూలంగా ఉన్న ఎగుమతులు ప్రధాన ఉత్పత్తుల ప్రతికూల వృద్ధి కారణంగా సుమారు రూ. 1.84 లక్షల కోట్లకు తగ్గాయని గణాంకాలు పేర్కొన్నాయి.
అక్టోబర్‌లో వాణిజ్య లోటు సుమారు రూ. 64.4 వేల కోట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు సుమారు రూ. 86.9 వేల కోట్లుగా ఉంది. అలాగే, దిగుమతులు కూడా 11.53 శాతం తగ్గి సుమారు రూ. 2.48 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అక్టోబర్‌లో ప్రధాన ఎగుమతులైన పెట్రోలియం ఉత్పత్తులు 52 శాతం, జీడిపప్పు 21.57 శాతం, రత్నాలు, ఆభరణాలు 21.27 శాతం, తోలు 16.67 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువులు 9.4 శాతం, కాఫీ 9.2 శాతం, సముద్ర ఉత్పత్తులు 8 శాతం, ఇంజనీరింగ్ వస్తువులు 3.75 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.