- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వచ్ఛమైన సృష్టికార్యం.. పూర్వీకుల శృంగారం
దిశ, ఫీచర్స్: విభిన్న సంస్కృతులు, మతాలు, జాతులు, వేష భాషలు, ఆహారపు అలవాట్లతో భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ చక్కటి ఉదాహరణ. ఇవేకాదు పురాతన చరిత్ర, సాధించిన విజయాలు ప్రపంచ దేశాల్లో ఇండియాకు ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టాయి. ఆధునిక ప్రపంచానికి అమూల్యమైన మేధాసంపత్తిని అందివ్వడంలో భారతీయ గ్రంథాలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఇదే క్రమంలో విభిన్న, శక్తివంతమైన సంస్కృతికి నిదర్శనమైన ప్రాచీన భారతీయ నిర్మాణానికి కొన్ని చారిత్రాత్మక ప్రార్థనా స్థలాలు సాక్ష్యాలుగా నిలిచాయి. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కోరికలను జయించాలని బోధిస్తూ సంపూర్ణ జీవన విధానానికి అవసరమైన జ్ఞానాన్ని అందించే వారథులయ్యాయి. ఈ కట్టడాలు శతాబ్దాల కిందటివైనా ప్రగతిశీల జీవనశైలికి ప్రతిబింబాలై, సొసైటీలో శృంగారంపై నెలకొన్న భావనలకు సమాధానమయ్యాయి. కళాత్మక శృంగార శిల్పాలతో సందర్శకులు, చరిత్రకారులను సైతం అబ్బురపరుస్తున్న పలు భారతీయ దేవాలయాల గురించి తెలుసుకుందాం..
సూర్య దేవాలయం(కోణార్క్, ఒరిస్సా)
11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయం సూర్య దేవుడికి అంకితం చేయబడింది. హిందూ పురాణాల్లోని క్షీరసాగర మధనంతో పాటు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని చిత్రీకరించే ప్రత్యేక శిల్పకళకు ఈ టెంపుల్ ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కాలంలో శృంగారాన్ని పవిత్ర కార్యంగా ఎలా పరిగణించేవారో దేవాలయ గోడలపై చెక్కిన శృంగార శిల్పాలను చూసి పర్యాటకులు తెలుసుకోవచ్చు. వీటిని చూస్తే పూర్వీకులు సెక్స్‌ను మానవ జన్మకు మార్గంగా, స్వచ్ఛమైన సృష్టికార్యంగా భావించేవారని స్పష్టమవుతుంది. కాగా ఆలయానికి సంబంధించిన కొన్ని శిల్పాలు పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.
లింగరాజ్ ఆలయం(భువనేశ్వర్, ఒరిస్సా)
కళింగ రాజవంశం నిర్మించిన పురాతన దేవాలయంలో విష్ణు, శివుడి స్వరూపమైన హరిహర స్వామికి అంకితం చేయబడింది. అత్యంత ప్రముఖ కట్టడాల్లో ఒకటైన ఈ టెంపుల్.. భువనేశ్వర్‌లో ప్రధాన పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. ఈ ఆలయ గోడలపై అలంకరించిన శిల్పాలు.. సెక్స్‌పై ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన ‘కామసూత్ర’ స్ఫూర్తితో చెక్కబడ్డాయి. యునెస్కో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన ఈ దేవాలయంలోకి హిందూయేతరులకు ప్రవేశం లేదు. కాగా ఇక్కడి శృంగారాత్మక శిల్పాలు ప్రాచీన భారతదేశంలో ప్రబలంగా ఉన్న తాంత్రిక విశ్వాసాల ద్వారా ప్రభావితమయ్యాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వర్ణనలు ప్రజలను ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయని పలువురి విశ్వాసం.
ఖజురహో దేవాలయాలు(మధ్యప్రదేశ్)
ఖజురహోలోని ఈ 25 దేవాలయాల సమూహం దాదాపు వెయ్యేళ్ల నాటిదని, ఆలయ నిర్మాణానికి 300-400 సంవత్సరాలు పట్టిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ చందేల రాజవంశీయులు నిర్మించిన శృంగార శిల్పాలు, నగారా తరహా ఆర్కిటెక్చరల్ చిహ్నాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఇక పురుషుల లైంగిక కోరిక నుంచి ‘ఖజురహో’ అనే పదం ఉత్పన్నమైందని కొందరి నమ్మకం కాగా.. దేవాలయ గోడలపై ఆకర్షించే ఫిజికల్ అప్పియరెన్స్, ఒంపులు తిరిగిన శరీరాలతో సమ్మోహన, ఆనందకర క్షణాల్లో నిమగ్నమైన పురుషులు, మహిళల శిల్పాలు చిత్రీకరించబడ్డాయి. వీటిలో బహుభార్యత్వం, బహుభర్తృత్వం, బైసెక్సువాలిటీ, హోమో సెక్సువాలిటీ వంటి అంశాలకు కూడా ఇందులో స్థానం కల్పించారు. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
విరూపాక్ష దేవాలయం(హంపి, కర్ణాటక )
శివుని స్వరూపమైన విరూపాక్షుడిని పూజించేందుకు వచ్చే యాత్రికుల కోసం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. దేవాలయ సముదాయంలో భాగమైన రంగ మండపం అందమైన రంగురంగుల కుడ్యచిత్రాలను కలిగి ఉంటుంది. రతి క్రీడా భంగిమల్లో ఉన్న జంటల శిల్పాలు ఈ దేవాలయం ముఖభాగంలో చెక్కబడ్డాయి. తుంగభద్ర నదిలో ఉన్న ఈ ఆలయ సముదాయం చుట్టూ శిథిలాలు, గుహలు, బండరాళ్లు ఉన్నాయి. దాదాపు 1600 స్మారక కట్టడాలు, మూడు పురాతన భారతీయ రాజవంశాలను గుర్తుచేస్తున్న హంపి దేవాలయ సమూహాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
నందా దేవి ఆలయం(ఉత్తరాఖండ్)
నందా దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం గోడలపై కొన్ని శృంగార చిత్రాలు ఉన్నాయి. ఇవి మరణానంతర జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రాపంచిక ఆనందాలను వదిలివేయవలసి ఉంటుందనే విషయాన్ని బోధిస్తుంటాయి.
సూర్య దేవాలయం(మొతేరా, గుజరాత్)
మొతేరాలోని సూర్య దేవాలయం భారత పురావస్తు శాఖ ద్వారా సంరక్షించబడిన రక్షిత స్మారక చిహ్నం. ప్రధాన మందిరంతో పాటు ఆలయ ప్రాంగణంలో అసెంబ్లీ హాలు, రిజర్వాయర్, మెట్ల బావి ఉన్నాయి. హిందూ దేవతామూర్తుల శిల్పాలతో పాటు శృంగార మూర్తుల శిల్పాలు గోడలపై చెక్కబడ్డాయి.