- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'భార్యా, పిల్లలున్నారు.. బౌన్సర్లు వేయకు'
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Former Pakistan cricketer Shoaib Akhtar)తనను తాను పొగుడుకోవడానికి ఎన్నో సార్లు టీం ఇండియా ఆటగాళ్ల (Team India players)ను అవమానపరిచేలా మాట్లాడాడు. ఈ విషయంలో హర్భజన్ (Harbhajan), సెహ్వాగ్ (Sehwag)వంటి వాళ్లు అతడిని హెచ్చరించినా అతడు తన కోతలు ఆపడం లేదు.
తాజాగా అక్తర్ (Akhtar)చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. తన బౌలింగ్‌లో ఆడటానికి భారత టెయిలెండర్లు (Indian Lower-order hitters) భయపడిపోయే వాళ్లని.. భార్య, పిల్లలు ఉన్నారు.. దయచేసి బౌన్సర్లు (Bouncers) వేసి గాయాలపాలు చేయవద్దని వేడుకునే వాళ్లు అని అక్తర్ (Akhtar) అన్నాడు. పాకిస్తాన్ జర్నలిస్ట్ సవేరా పాషా (Pakistani journalist Savera Pasha) యూట్యూబ్ ఛానల్ (YouTube channel)లో ఈ విషయాలు వెల్లడించాడు.
‘ఒక సారి కౌంటీ నెట్స్ (County Nets)లో బౌలింగ్ చేస్తున్నాను. చీకటి పడుతుంది ఇక్కడితో ఆపేద్దామని నేను చెప్పాను. కానీ ఆ ఇంగ్లీష్ క్రికెటర్ (English cricketer) నా మాట వినలేదు. బౌలింగ్ చేయమని పట్టుబట్టాడు. దాంతో చేసేది లేక ఒక బంతి విసిరాను. అది నేరుగా అతని దవడకు తగిలి వికెట్లపై కుప్పకూలిపోయాడు. చనిపోయాడేమో అనుకున్నా. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
ఒకసారి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిరిస్టెన్ (Former South African cricketer Gary Kirsten)కు కూడా గాయపడ్డాడు. ఇప్పటికీ తన కంటి కింద ఉన్న గాయాన్ని నాకు చూపిస్తుంటాడు. కొంత మంది భారత ఆటగాళ్లు (Indian players), ఇతర టెయిలెండర్స్) (Lower-order hitters)..‘కావాలంటే మమ్మల్ని ఔట్ చేసుకో.. కానీ, బంతితో గాయపర్చకు. ఎందుకంటే నీ బంతులు చాలా బలంగా తగులుతాయి. మాకు భార్యాపిల్లలు ఉన్నారు. అలాగే మా తల్లిదండ్రులు చూస్తే బాధపడతారని వేడుకునే వాళ్లు’ అని అక్తర్ ఆ షోలో చెప్పాడు. అయితే అక్తర్ చెప్పేవన్నీ అతిశయోక్తులేనని అతడి గురించి తెలిసిన క్రికెటర్లు (Cricketers) అంటున్నారు. అతడు ఫాస్టెస్ట్ బౌలరే (Fastest bowler).. కానీ బ్యాట్స్‌మెన్ (Batsman) ఎవరూ అతడి దగ్గరకు వెళ్లి బతిమిలాడుకోలేదు అని తేల్చి చెప్పుతున్నారు.