- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > చైనా దురాగతాలపై స్పెషల్ కవరేజ్.. మేఘా రాజగోపాలన్‌కు ‘పులిట్జర్’ అవార్డు..
చైనా దురాగతాలపై స్పెషల్ కవరేజ్.. మేఘా రాజగోపాలన్‌కు ‘పులిట్జర్’ అవార్డు..
X
న్యూఢిల్లీ : భారత సంతతి జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌కు అమెరికా అత్యున్నత జర్నలిజం అవార్డు పులిట్జర్ వరించింది. చైనాలో ముస్లింలను నిర్బంధించడానికి నిర్మించిన క్యాంపులపై రాసిన పరిశోధనాత్మక కథనాలకు గాను మరో ఇద్దరితో కలిసి ఆమె పురస్కారాన్ని పొందారు. అమెరికా మీడియా సంస్థ బజ్‌ఫీడ్‌లో ఆమె పనిచేస్తున్నారు. చైనాలో జిన్‌జియాంగ్ రీజియన్‌లోని క్యాంపులను తొలిసారి సందర్శించిన ఆమెపై ఆ దేశం ఆంక్షలు విధించింది.
సమాచారం బయటికి పొక్కకుండా చైనా ప్రయత్నించినప్పటికీ ఆ దేశంలోకి వెళ్లకుండానే మరో ఇద్దరితో కలిసి టెక్నాలజీ సహాయంలో గుట్టును ఛేదించారు. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో మేఘా పులిట్జర్ పురస్కారం గెలుచుకోగా, లోకల్ రిపోర్టింగ్ కేటగిరీలో తంపా బే టైమ్స్‌లో పనిచేస్తు్న్న భారత సంతతి జర్నలిస్టు నీల్ బేడీ జర్నలిస్టు కాథలీన్ మెక్‌గోరీతో కలిసి బహుమానం పొందారు.
Advertisement
Next Story