- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత అమ్ముల పొదిలో సుఖోయ్, మిగ్-29ఎయిర్ క్రాఫ్ట్స్
న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనా మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుత సమయంలో డ్రాగన్ కంట్రీని అదుపు చేయాలంటే వాయుసేనకు మరింత బలం చేకూర్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాల కొనుగోలకు మోదీ సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ డిఫెన్స్ డీల్‌కు సంబంధించి రక్షణ శాఖ ద్వారా ఎయిర్‌ఫోర్స్‌కు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. 12 సుఖోయ్, 21 మిగ్-29 యుద్ధ విమానాలు కొనుగోలు ఈ డీల్ యొక్క సారాంశంగా ఉంది. లద్దాక్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణలో 20మంది భారత సైనికులు చనిపోవడంతోనే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నదని ఆర్మీ ఉన్నతవర్గాల సమాచారం. ఓవైపు చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి జరుగుతుండగానే ఈ నెల 15న చైనా ఆర్మీ బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చేందుకు యత్నించాయి. వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన భారత జవాన్లపై చైనా బలగాలు రాడ్లు, బండరాళ్లు, ఫెన్సింగ్ చుట్టిన కర్రలతో దాడి చేసి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటన పట్ల కేంద్రం సీరియస్ గా ఉండటమే కాకుండా, సైనికుల బలిదానాలను వృథా కానీయబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అదే విధంగా మన భూభాగాలను ఆక్రమించుకునేందుకు బుసలు కొడుతున్న డ్రాగన్ కంట్రీకి గట్టి గుణపాఠం చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.ఈ విషయమై శుక్రవారం నిర్వహించబోయే అఖిల పక్ష సమావేశంలో అందరీ సలహాలు, సూచనల మేరకు చైనాపై చర్యలుంటాయని దేశం భావిస్తోంది. ఇందులో భాగంగానే త్రివిధ దళాలను కేంద్రం అప్రమత్తం చేసింది.