వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్ ధరలు

by Anukaran |   ( Updated:2021-10-17 03:21:38.0  )
petrol
X

దిశ, వెబ్‌డెస్క్ : పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంధన ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. శనివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. వరుసగా నాలుగో రోజూ ఆదివారం వినియోగదారులపై మరో 35 పైసలు వడ్డించాయి.

దీంతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.84కి ఉండగా, డీజిల్‌ ధర రూ.94.57కు చేరింది. ఇక వాణిజ్య రాజధాని అయినా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.77కి, డీజిల్‌ ధర రూ.102.52కు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. పెరిగిన ధరలతో ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.110.09, ఉండగా డీజిల్‌ ధర రూ.103.18గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112. 38 కు చేరగా డీజిల్ ధర రూ. 104. 83 కు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed