ఆ జిల్లాలో సమయం తక్కువాయే.. వ్యాక్సినేషన్ పూర్తికాకపాయే

by Shyam |   ( Updated:2023-03-28 14:50:16.0  )
ఆ జిల్లాలో సమయం తక్కువాయే.. వ్యాక్సినేషన్ పూర్తికాకపాయే
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఒమిక్రాన్ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంతో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. కరోనా రెండవ దశలో తన ప్రతాపాన్ని చూపిన నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దశలవారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన వారిని మొత్తం 26,20,891 మందిని గుర్తించింది. వీరందరికీ యుద్ధ ప్రతిపాదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. మొదటి దశలో వైరస్ తీవ్రత కారణంగా 85.05 శాతంతో 22,29, 316 మంది వ్యాక్సిన్ తీసుకోగా, రెండవ దశకు వచ్చేసరికి వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం పూర్తిగా తగ్గింది. 25 శాతం‌తో కేవలం 6, 56, 242 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో అతి తక్కువ ఉన్న జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలు ఉండడం విశేషం.

జిల్లాల వారిగా వివరాలు :

మహబూబ్ నగర్ జిల్లాలో 18 సంవత్సరాలకు పైబడిన వారి సంఖ్య 6, 89,692 మందిని గుర్తించారు. వారిలో మొదటి విడత వ్యాక్సినేషన్ 81 శాతంతో 5, 56,177 మంది యాక్షన్ తీసుకోగా, రెండవ దశ వ్యాక్సినేషన్‌ను 29 శాతం‌తో 20,2177 మంది తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 6, 27, 625 మందికి గాను మొదటి విడత డోసులు 89 శాతం‌తో 5, 61,070 శాతం మంది, రెండవ విడత డోసులు 27 శాతంతో1,68,997 మంది, వనపర్తి జిల్లాలో 4, 15, 650 మంది‌కి గాను మొదటి విడత డోసులను 87 శాతం‌తో 3, 65, 207 మంది తీసుకున్నారు. రెండవ డోసును 26 శాతం‌తో1, 11, 110 మందికి వేశారు. జోగులాంబ గద్వాల జిల్లా‌లో మొత్తం 4, 60, 075 మందికి గాను మొదటి విడత 82% తో 3, 75,528 మంది, రెండో విడతలో 19 శాతంతో 85, 242 మంది‌కి వ్యాక్సినేషన్ అందింది. నారాయణపేట జిల్లాలో 4, 15, 650 మందికి మొదటి విడత 88 శాతంతో 3, 65,207 మందికి వేయగా రెండో విడత డోసులు మాత్రం 21 శాతం‌తో 88, 716 మందికి వేశారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాలు పలు కారణాలతో వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనకబడి ఉన్నాయి.

మరింతగా పెరిగే అవకాశం :

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలకు పైబడి ఉన్న వారు 26, 20, 891 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో అసలే తీసుకొని వారు, రెండో విడత డోసు తీసుకోని వారి సంఖ్య 19, 64, 221 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, గత కొన్ని నెలలుగా 18 సంవత్సరాలు నిండిన మరికొంతమంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కారణంగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌కి ఆటంకాలు:

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికార యంత్రాంగానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కావల్సినన్ని సెంటర్లు గతంలో ఏర్పాటు చేయకపోవడం, వయసుల వారీగా, వృత్తుల వారికి వ్యాక్సినేషన్ లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం, కాయకష్టం చేసుకుని బతికే జనం గంటల తరబడి వ్యాక్సిన్ సెంటర్ దగ్గర ఉండడానికి ఆసక్తి చూపకపోవడం, ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలస జనం ఉండడం, ప్రజలలో మూఢ విశ్వాసాలు, మత విశ్వాసాల కారణంగా చాలామంది యాక్షన్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యాక్సినేషన్ చేయడానికి వెళ్లిన సిబ్బందికి, పలు గ్రామాల్లో జనం ఇబ్బందికి గురి చేసిన అడిగే నాయకులు, అధికారులు లేకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతము రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో నెల రోజుల్లో 100% టార్గెట్‌ను పూర్తిచేయాలని అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలా ఇబ్బందులు పెడుతున్నారు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు కారణాలతో జనం వ్యాక్సినేషన్ ను తీసుకోవడానికి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నచింతకుంట మండలం బండర్ పల్లి గ్రామంలో ఓ వ్యక్తికి వ్యాక్సినేషన్ చేయడానికి వెళితే వ్యాక్సినేషన్ తీసుకోనని మొండికేశాడు. ఇలా పలుమార్లు చేయడంతో వైద్య సిబ్బంది ఏమాత్రం వెనుకంజ వేయకుండా చివరికి ఆ వ్యక్తికి వ్యాక్సినేషన్ చేశారు. ఇలా ప్రతి గ్రామంలోనూ వ్యాక్సినేషన్ ఇచ్చే సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. పోలీసులు సైతం ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed