అమెరికా, చైనా తర్వాత మనమే

by Shamantha N |
అమెరికా, చైనా తర్వాత మనమే
X

న్యూఢిల్లీ: రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న ప్రపంచ దేశాల జాబితాలో భారత్ తొలిసారి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ‘స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎస్ఐపీఆర్ఐ) అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికా తమ దేశ రక్షణ రంగానికి 2019లో అత్యధికంగా 732 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి, ఎప్పట్లానే మొదటి స్థానంలో నిలువగా, 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికొస్తే.. మన దేశ రక్షణ రంగానికి గతేడాదిలో 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి, మూడో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో రష్యా (65.1 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (61.9 బిలియన్ డాలర్లు) దేశాలున్నాయి. కాగా, దేశ భద్రత కోసం ప్రపంచదేశాలు చేస్తున్న ఖర్చు 2018తో పోల్చితే గతేడాదిలో 3.6శాతం పెరిగినట్టు ఎస్ఐపీఆర్ఐ వివరించింది.

Tags: india in top 3, largest military spenders, military spenders, india, america, china,

Advertisement

Next Story

Most Viewed