- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు అశ్వాలకు అస్వస్థత..!
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి సేవల్లో పాలు పంచుకునే మూడు అశ్వాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. మేత తిన్న కొద్ది సమయానికే అశ్వాలు కుప్పకూలిపోయాయి. దీనిని గమనించిన ఆలయ అధికారులు పశువైద్యాధికారుల సాయంతో వాటికి చికిత్సను అందిస్తుండగా.. అశ్వ అనే గుర్రం మృతి చెందింది. మిగతా రెండు గుర్రాల్లో ఒక్కటి పూర్తిగా కోలుకోగా.. మరొక్కటి చికిత్స పొందుతోంది. స్వామివారికి సేవలందించే అశ్వాలకు ఇలా జరగడంపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి చిన్న వెంకన్న సేవ కోసం 20 నెలల క్రితం అశ్వ, శ్వేత అనే రెండు అశ్వాలను ఆలయానికి బహూకరించారు. మరోవైపు ద్వారకా తిరుమలకు చెందిన దేవస్థానం ఉద్యోగి శోభనగిరి ఏడాదిన్నర క్రితం యోగిని అనే అశ్వాన్ని ఆలయానికి బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఆలయ అధికారులు వాటిని శ్రీవారి తిరువీధి సేవలకు, అలాగే ధనుర్మాస, కనుమ, బ్రహ్మోత్సవాలకు వినియోగిస్తున్నారు.