Ponguleti Srinivas Reddy : మంచి ప్రతిపక్షంగా ఉండండి : బీఆర్ఎస్ కు పొంగులేటి హితవు

by M.Rajitha |
Ponguleti Srinivas Reddy : మంచి ప్రతిపక్షంగా ఉండండి : బీఆర్ఎస్ కు పొంగులేటి హితవు
X

దిశ, వెబ్ డెస్క్ : సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషిని ఎక్స్ రే తీసినట్టు సర్వే కూడా స్పష్టంగా జరుగుతోందని అన్నారు. కుటుంబ సర్వేపై, కులగణనపై విపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని మండి పడ్డారు. గత ప్రభుత్వం చేయించిన కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టలేదని పొంగులేటి ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము ఇపుడు సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎంతో దూరదృష్టితో ఈ సర్వే చేపట్టారని, ఒక మనిషిని ఎక్స్ రే తీసినట్టుగా చాలా పారదర్శకంగా సర్వే కొనసాగుతోందని మంత్రి మీడియాకు తెలియ జేశారు.

Advertisement

Next Story