ADMK : సభకు రండి.. కుర్చీ పట్టుకెళ్లండి!అన్నాడీఎంకే బంపర్ ఆఫర్.. తర్వాత ఏమైందంటే?

by Ramesh N |   ( Updated:2024-11-18 12:58:04.0  )
ADMK : సభకు రండి.. కుర్చీ పట్టుకెళ్లండి!అన్నాడీఎంకే బంపర్ ఆఫర్.. తర్వాత ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ సభలకు జనాలను తీసుకురావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కొన్ని పార్టీలు బహిరంగ సభల కోసం ప్రజలకు డబ్బులు ఇచ్చి మరి తీసుకొస్తుంటారు. సభలకు భారీ సంఖ్యలో ప్రజలు హజరయ్యే విధంగా వాహనాలు, ట్రైన్‌లు సైతం రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తుంటాయి. సభలకు రప్పించే విధంగా బిర్యానీ ప్యాకెట్లు, బీర్ బాటిల్స్ లాంటివి ఏవేవో ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ పార్టీ ప్రజలను సభకు రప్పించే విధంగా వినూత్న ప్రయోగం చేసింది. ప్రజలకు ఉపయోగపడే వస్తువులు ఇవ్వాలని ఆలోచన చేసింది. సభకు రండి.. వెళ్ళేటప్పుడు కుర్చీ తీసుకెళ్లండని (Tamil Nadu) తమిళనాడులో (ADMK) అన్నాడీఎంకే పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తమిళనాడులోని తిరుప్పూర్ పెరమనల్లూర్‌లో జరిగిన సర్వసభ్య సమావేశం సభ కోసం లోకల్ లీడర్స్ స్థానికులని సభకి తరలించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు ప్రచారం అవుతోంది. దాదాపు 1600 కూర్చీలను ఏర్పాటు చేశారు. ప్రజలు సభ అయ్యేంత వరకు కూర్చోని రిటర్న్ గిఫ్ట్‌గా కూర్చీలను తీసుకోని వెళ్లారు. కొంత మంది అత్యుత్సాహంతో రెండు, మూడు కంటే ఎక్కువ కూర్చీలను తీసుకొని ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story