- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెల్లూరులో అక్రమంగా డబ్బు తరలింపు.. తమిళనాడుకు చెందిన ఇద్దరు అరెస్ట్
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు నుండి చెన్నైకు వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సులో అక్రమంగా డబ్బు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి లెక్కలు లేకుండా 66,56,900 రూపాయలను తరలిస్తుండగా దొరవారిసత్రం పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గూడూరు డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రాత్రి సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. తమిళనాడుకు చెందిన బస్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేసినట్లు తెలిపారు.
ఆ తనిఖీల్లో ఎలాంటి లెక్క పత్రాలు లేని నగదు 66,56,900 రూపాయలు ఉండడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. చెన్నైకు చెందిన కిరణ్, విష్ణులను అదుపులోకి తీసుకున్నామని.. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
- Tags
- ap
- Illegal money