- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen: ఈ సినిమాలో చాలా మేటర్ ఉంటోంది.. ‘మెకానిక్ రాకీ’పై హీరో కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ (SRT Entertainments) బ్యానర్‌పై రామ్ తాళ్లూరి (Ram Talluri) నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ కాగా.. పాజిటివ్ అంచనాల మధ్య ‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్.. తాజాగా మీడియాతో ముచ్చటించాడు.
‘గత నాలుగైదు ఏళ్ళుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్‌ని తీసుకోవచ్చు. మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ (Second Half)కి వచ్చేసరికి అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ (First Half)కి సెకండ్ హాఫ్‌కి జోనర్ మారుతుంది. సెకండ్ హఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ ఉంది. మేము ట్రైలర్‌లో కథని పెద్దగా రివిల్ చేయలేదు. సినిమాలో చాలా కథ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read More...
Vishwak Sen: ‘మెకానిక్ రాకీ’ సినిమా సెన్సార్ పూర్తి.. విశ్వక్ సేన్ పోస్ట్ వైరల్