- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IPL-2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరు దక్కించుకున్నా రికార్డే..!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025(IPL-2025)కు సంబంధించి మెగా వేలం(Mega Auction) నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జెడ్డా(Jeddah) వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలం పాటలో మొత్తం 574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే అందులో ఓ 13 ఏళ్ల ఓ క్రికెటర్ కూడా ఉన్నాడు. ఆ యంగ్ క్రికెటర్ ఎవరో కాదు బీహార్(Bihar)కు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi). సాధారణంగా పదమూడేళ్ల వయస్సులో అందరూ ఆడుతూపాడుతూ ఉంటారు కానీ ఈ క్రికెటర్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐపీఎల్ మెగా వేలంలో తన పేరుని నమోదు చేసుకుని వార్తల్లోకి ఎక్కాడు. పెద్ద పెద్ద ఆటగాళ్లే తమని సెలెక్ట్ చేస్తారో లేదోననే భయంతో వేలంలో పాల్గొనకుండా వెనకడుగు వేస్తుంటే.. తాను మాత్రం 30 లక్షల బేస్ ప్రైస్(Base Price)తో తన పేరును ఎంట్రీ చేయించాడు. దాదాపు 35 సంవత్సరాల క్రితం సచిన్ 16 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంత చిన్న వయస్సులో ఎవరూ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. కానీ త్వరలో నిర్వహించే ఐపీఎల్ మెగా వేలంలో ఈ 13 ఏళ్ల వైభవ్ ను ఏదైనా ఫ్రాంచైజీ దక్కించుకుంటే క్రికెట్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసినట్టే.
వైభవ్ సూర్యవంశీ ఎవరు..?
వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్‌పూర్(TajPur) గ్రామంలో 2011లో జన్మించాడు. ఇతను 5 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ నేర్చుకోవడం ప్రారంభించాడు. చిన్న వయసులోనే కుమారుడికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గ్రహించిన అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ(Sanjeev Suryavanshi) వైభవ్ కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్ తయారు చేయించాడు. మరో నాలుగేళ్లకే సమస్తిపూర్(Samastipur)లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండేళ్లు ట్రైనింగ్ తీసుకున్న అతడు అండర్- 16 జట్టులోకి వచ్చేశాడు. ఇదిలా ఉంటే.. వైభవ్ తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను కేవలం 12 సంవత్సరాల వయస్సులో ఆడటం విశేషం. అదే సమయంలో బీహార్ క్రికెట్ అసోసియేషన్(BCA) నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19(Randhir Verma Under-19) వన్డే టోర్నీలో అతడు ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ టోర్నీ చరిత్రలో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కావడం విశేషం. అలాగే గత నెలలో ఆస్ట్రేలియా(AUS)తో జరిగిన అండర్-19 మ్యాచులో కూడా వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 104 పరుగులు చేసి కంగారుల బౌలర్లను ఊచకోత కోశాడు. ఆ మ్యాచులో అతను కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి, అండర్-19 టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అయిన వైభవ్ దూకుడుగా ఆడుతుంటాడు. ఫీల్డింగ్ సెటప్ బట్టి సిక్సులు, ఫోర్లు బాదటం అతని స్పెషాలిటీ.