రేపు లక్నవరం మూడో దివిని ప్రారంభించనున్న మంత్రి జూపల్లి

by Kalyani |
రేపు లక్నవరం మూడో దివిని ప్రారంభించనున్న మంత్రి జూపల్లి
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం అయినా లక్నవరం జలాశయం లోని మూడవ దీవిని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ప్రారంభించనున్నారు. లక్నవరం సరస్సు అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు బస కల్పించే విధంగా లక్నవరం సరస్సు మధ్యలో గల మూడవ దీవిని ఏర్పాటు చేసి, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులతో పాటు, పెద్దలు సరదాగా గడిపేందుకు అనేక రకాల ఆక్టివిటీస్ ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. బుధవారం మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న లక్నవరం మూడో దీవి లక్నవరం అందాలను మరింత పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed