RRB Exams Schedule: 41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రకటించిన ఆర్‌ఆర్‌బీ

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-19 17:25:31.0  )
RRB Exams Schedule: 41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రకటించిన ఆర్‌ఆర్‌బీ
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇండియన్ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(RRB) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలోని వివిధ విభాగాలకు చెందిన నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్(Exams Schedule)ని ప్రకటించింది. ఈ పరీక్షలన్నీ నవంబర్, డిసెంబర్ నెలలో కంప్యూటర్ బేస్డ్(CBT) విధానంలో జరుగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్(Exam Centre) వివరాలును తెలుసుకోవచ్చని, నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లు(Hall Tickets) డౌన్ లోడ్ చేసుకోవచ్చని రైల్వే డిపార్ట్ మెంట్ పేర్కొంది. కాగా పరీక్షకు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్(Aadhaar Linked Biometric) తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్ కార్డు(Aadhaar card)ను తీసుకురావాల్సిన ఉంటుందని సృష్టం చేసింది.

కాగా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) , 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF), 14,298 టెక్నీషియన్(Technician), 7,951 జూనియర్ ఇంజినీర్(JE) మొత్తం కలిపి 41,500 ఉద్యోగాలకు ఈ నియామక పరీక్షలను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించనుంది. ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి ఎగ్జామ్స్ షెడ్యూల్ కోసం https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌ ను సందర్శించగలరు.

Advertisement

Next Story

Most Viewed