TDP: యావత్ భారతదేశం ఏపీ వైపు.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-11-19 17:05:28.0  )
TDP: యావత్ భారతదేశం ఏపీ వైపు.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: యావత్ భారతదేశం ఏపీ వైపు చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అన్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో ఎస్ఐపీబీ సమావేశం(SIPB Meeting) జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఏపీకి రానున్నకంపెనీలు, జాబుల వివరాలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రంలో 5నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైందని తెలిపారు. అలాగే అయిదేళ్లలో 20లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra)లో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే నేను చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయని చెప్పారు.

అంతేగాక చంద్రబాబు గారి రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్న నేను ఆనాడు చెప్పిన మాటలు నిజమవుతున్నాయని, మిట్టల్(Mittal), రిలయన్స్ రెన్యువబుల్ ఎనర్జీ(Reliance Renewable Energy), టీసీఎస్(TCS), సెరెంటికా గ్లోబల్(Serentica Global) వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టాయని తెలిపారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ. 85వేల కోట్ల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం రీస్టార్ట్ ఏపీ(Restart AP)లో తొలి అడుగని వివరించారు. ఇక రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎస్ఐపీబీ తొలి సమావేశంలోనే యువతకు 34వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేయడం ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఏపీ వైపు చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నారా లోకేష్ రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed