- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: తెలంగాణ ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త..! కేంద్రమంత్రి హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సిద్దాంతాలు(Congress Ideologies) దివాళా(Bankruptcy) తీసే పరిస్థితులకు దిగజారుస్తాయని, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) సూచించారు. హిమచల్ ప్రదేశ్(Himachal Pradesh) పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలను(People Of Telangana) హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన.. పరిమితులు(Restrictions) లేకుండా ఇచ్చే ఉచితాలు(Freebies) ఎక్కడికి దారితీస్తాయో హిమాచల్ ప్రదేశ్ ను చూస్తే అర్థమవుతుందని, విద్యుత్ కంపెనీల బకాయిలు చెల్లించటానికి ప్రభుత్వ భవనాలను వేలం వేసే దుస్థితికి హిమాచల్ ప్రదేశ్ చేరిందని తెలిపారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను సరిగా అర్థం చేసుకోకుండా ఎన్నికలలో విజయం కోసం ఇచ్చే హామీలు రాష్ట్రాలను దివాళా తీసే పరిస్థితికి దిగజారుస్తాయనే దానికి హిమాచల్ ప్రదేశ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఇక మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) పీకల్లోతు అప్పుల్లో ముంచితే, ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను నిండా ముంచి దివాళా తీయించాలని కంకణం కట్టుకొని పాలన సాగిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాక తెలంగాణ ప్రజలారా!.. కాంగ్రెస్ ప్రభుత్వంతో తస్మాత్ జాగ్రత్త(Be Careful) అని కిషన్ రెడ్డి హెచ్చరించారు.