- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేస్తుంది కబ్జా… ఆపై దాడులు.. అధికారుల సమక్షంలోనే “దిశ రిపోర్టర్” పై భౌతిక దాడి
దిశ, మేడ్చల్ బ్యూరో: బిల్డర్ బరితెగించాడు.చెరువుల కబ్జాల భాగోతం వెలుగులోకి రావడంతో విచక్షణ కొల్పోయాడు.సాక్షాత్తు మండల తహసీల్దార్ సమక్షంలోనే ‘దిశ’ పత్రిక విలేకరి పైన గుండాలతో దాడి చేయించాడు.రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ.. విల్లాలు నిర్మించి దర్జాగా సొమ్ము చేసుకుంటున్న “త్రిపుర కన్ స్ట్రక్షన్” మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ అక్రమాలపై ‘దిశ’ దిన పత్రిక వరుస కథనాలు రాస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు మంగళవారం త్రిపుర వెంచర్ల వద్ద సర్వే చేశారు. ఈ నేపథ్యంలో వార్తా సేకరణకు వెళ్లిన ‘దిశ’ పత్రిక విలేకరి పై దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ తరహా దాడులు చేశారంటే త్రిపుర నిర్మాణ సంస్థ ఏ రీతిలో బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు.
'దిశ' కథనాలతో ఫీల్డ్ సర్వే..
మేడ్చల్ జిల్లా,కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలోని దొమ్మర పోచంపల్లి లో త్రిపుర నిర్మాణ సంస్థ చేపడుతున్న‘ త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్టు’ అక్రమ నిర్మాణాలపై దిశ పత్రికలో “త్రిపుర మార్క్ దందా”, “ రూ.300 కోట్ల భూమి కబ్జా”.. శీర్షికలతో వరుస కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో మంగళవారం దుండిగల్ గండి మైసమ్మ మండల తహసీల్దార్ సయ్యద్ మతిన్,ఇరిగేషన్ ఏఈ స్వప్న, సర్వేయర్ రూప, ఆర్ఐ అన్వేష్ లు సిబ్బందితో కలిసి దొమ్మర పోచంపల్లి లో నిర్మాణాలు జరుగుతున్న త్రిపుర ల్యాండ్ మార్క్ 5 లో క్షేత్రస్థాయి సర్వేకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న కబ్జాల వ్యవహారంపై వివరాలు సేకరించి పనిలో నిమగ్నమయ్యారు.త్రిపుర నిర్మాణ సంస్థ చెరువు బఫర్ జోన్ , ఎఫ్ టీఎల్ స్థలాలను కబ్జా చేసినట్లు గుర్తించారు.
వార్త సేకరణకు వెళ్లిన రిపోర్టర్ పై..
సమాచారం తెలుసుకున్న దిశ పత్రిక స్థానిక రిపోర్టర్ మద్దయ్య వార్తా సేకరణ నిమిత్తం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు చేపడుతున్న సర్వే ప్రాంగణానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జరుగుతున్న సర్వే ప్రక్రియ ఫోటోలను తీసుకుంటున్న క్రమంలో త్రిపుర నిర్మాణ సంస్థ ఎండి సుధాకర్ గమనించి తన అనుచరులతో మూకుమ్మడిగా దిశ రిపోర్టర్ మద్దయ్య పై దాడులు చేయించాడు. అక్కడే ఉన్న వంపు గూడెం బాల్ రెడ్డి, వంపు గూడెం భూపాల్ రెడ్డి, చిన్నారెడ్డి లతోపాటుగా మరో 10 మంది గుండాలతో కలిసి విలేకరిపై పిడిగుద్దులు కురిపించారు. వెంటనే అక్కడే ఉన్న తహసీల్దార్ మతిన్ స్పందించి దాడులు చేస్తున్న వారిని ఆపే ప్రయత్నం చేశారు. విలేకరిపై దాడులు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తోందని బేధిరించారు. అయినప్పటికీ విలేకరి మద్దయ్యను చెప్పరాని భాషలో బూతులు తిడుతూ దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో మద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు.
ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సంఘాలు..
వార్తా సేకరణకు వెళ్లిన దిశ పత్రిక రిపోర్టర్ మద్దయ్య పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖంగించాయి. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దుండిగల్ సీఐ సతీష్ కు జర్నలిస్ట్ నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విలేకరుల పై దాడులకు పాల్పడిన త్రిపుర నిర్మాణ సంస్థ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (టీయుడబ్ల్యూజే- ఐ జె యు ) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు డిమాండ్ చేశారు.విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేసిన ఎంతటి వారినైనను ఉపేక్షించేది లేదని , అటువంటి వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, త్రిపుర కన్స్ట్రక్షన్ ఎండి సుధాకర్ తో పాటుగా ఫిర్యాదులో పేర్కొన్న వారిని సైతం అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
త్రిపుర నిర్మాణ సంస్థ దుండిగల్ తహసీల్దార్ మతీన్ సమక్షంలో నే జర్నలిస్టులపై దాడులకు దిగడం దారుణమన్నారు. చెరువులను, కుంటలను కబ్జాలు చేస్తూ వెలుగులోకి తీసుకువచ్చిన విలేకరులపై పక్కా ప్రణాళిక తోనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన దుండిగల్ సీఐ సతీష్ ను వెంటనే కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దిశ జిల్లా బ్యూరో కల్లెపల్లి రవిచంద్ర, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక వెంకట్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి. సాయిబాబా, జర్నలిస్టులు రాందేవ్, లింగస్వామి, రాజు, రామకృష్ణ రెడ్డి, రాజేందర్,దత్తు, పాషా తదితరులు పాల్గొన్నారు.
దాడులే అక్రమాలకు నిదర్శనం : ఆకుల సతీష్
త్రిపుర సంస్థ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ’దిశ‘ దినపత్రిక జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నిజాంపేట బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు.పత్రిక విలేకరి మద్దయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉన్నతాధికారుల సమక్షంలోని పత్రిక విలేకరి పై దాడికి తెగబడ్డారు అంటే త్రిపుర నిర్మాణ సంస్థ చేస్తున్న దౌర్జన్య అక్రమాలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
త్రిపుర నిర్మాణ సంస్థ అక్రమాలపై ఫిర్యాదు..
డి పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో చెరువులను ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ చేపట్టిన త్రిపుర ల్యాండ్ మార్క్ 5 వెంచర్ వెంచర్ నిర్మాణాలపై బిజెపి నేత ఆకులు సతీష్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు పూర్తి ఆధారాలతో మంగళవారం ఫిర్యాదు చేశారు. దొమ్మర పోచంపల్లి, బోరం పేట గ్రామ పరిధిలో ఉన్న కోమటికుంట, పగడ సముద్రం, మొండికుంట ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటంతో పాటుగా ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి కట్టడాలు చేస్తుందని వెంటనే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ ఇ హైదర్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీత , దుండిగల్ ఎమ్మార్వో మతిన్ లు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆకుల సతీష్ పేర్కొన్నారు.