Mallu Ravi: అధికారులపైకి రైతులను ఉసిగొల్పింది మీరు కాదా?.. కేటీఆర్‌పై మల్లు రవి ఫైర్

by Gantepaka Srikanth |
Mallu Ravi: అధికారులపైకి రైతులను ఉసిగొల్పింది మీరు కాదా?.. కేటీఆర్‌పై మల్లు రవి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై కాంగ్రెస్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(Mallu Ravi) సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేటీఆర్(KTR) డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే గిరిజనుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసిగొల్పింది మీరు కాదా? అని మండిపడ్డారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో కొత్త డ్రామాలకు తెరలేపారని సీరియస్ అయ్యారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు కలెక్టర్‌‌‌‌పై దాడి చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారం ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ప్రజలను బీఆర్‌‌‌‌ఎస్‌‌ రెచ్చగొడుతోందని మండిపడ్డారు.

Next Story

Most Viewed