యెస్ బ్యాంకుకు దిగ్గజ బ్యాంకుల చేయూత

by Shamantha N |
యెస్ బ్యాంకుకు దిగ్గజ బ్యాంకుల చేయూత
X

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోన్నయెస్ బ్యాంకును ఆదుకునేందుకు దిగ్గజ ప్రయివేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ,కొటక్ మహింద్రా బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ యెస్ బ్యాంకులో 49శాతం వాటాను కొనుగోలు చేసేందుకు డీల్ కూడా కుదుర్చుకుంది. తాజాగా ఐసీఐసీఐ రూ.1000కోట్లు ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తాము కూడా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిన దిగ్గజ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ రూ.1000కోట్లు, యాక్సిక్ బ్యాంకు రూ.600కోట్లు, కోటక్ మహింద్రా రూ.500కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నయెస్ బ్యాంకుపై కేంద్రంతో షరుతులు విధించడంతో పాటు, ఆర్‌బీఐ మారటోరియం విధించింది. దీంతో ఖతాదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అయితే యెస్ బ్యాంకును ఆదుకునేందుకు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ముందుకు రావడం, పెట్టుబడులు పెట్టడంతో తమ ఇబ్బందులు తప్పనున్నాయని కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags: yes bank, icici, axis bank, kotak, hdfc, sbi, 1000crore and 600crore,500crore financial crisis

Advertisement

Next Story

Most Viewed