Dhanya Balakrishna :నేను తాగింది మంచినీళ్లే.. మద్యం కాదు

by Shyam |   ( Updated:2021-05-16 10:49:44.0  )
Dhanya Balakrishna :నేను తాగింది మంచినీళ్లే.. మద్యం కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సూర్య ‘సెవంత్ సెన్స్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ. అతితక్కువ కాలంలోనే తన నటనాశైలితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ తమిళ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అయితే ఓ అభిమాని ‘రాజరాణి’ సినిమాలో పాత్రని మీ నిజజీవితంతో పోల్చవచ్చా..? అని ప్రశ్నించాడు.

దీనికి స్పందిస్తూ ఆ సినిమాలో నేను మద్యం సేవించినట్లు చూపించారు. కానీ నేను నిజజీవితంలో మంచినీళ్లు మాత్రమే తాగుతానని.. అప్పడు కూడా అదే జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఓ అభిమాని ధన్య మీ క్రెడిట్ కార్డు నెంబర్, దాని సీవీవీ నెంబర్ చెప్పాలని కోరగా.. ‘అది మీకు ఎందుకు?’ అంటూ ధన్య రిప్లే ఇచ్చింది.

Dhanya Balakrishna Wiki, Age, Biography, Family, Wikipedia, Family, Movies

Dhanya Balakrishna Photos [HD]: Latest Images, Pictures, Stills of Dhanya Balakrishna - FilmiBeat

Dhanya Balakrishna

Advertisement

Next Story