భార్యను స్నేహితులతో పంచుకున్న భర్త.. 2గంటల తర్వాత..?

by Anukaran |   ( Updated:2020-12-20 10:34:14.0  )
భార్యను స్నేహితులతో పంచుకున్న భర్త.. 2గంటల తర్వాత..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తాళి కట్టిన భార్యను పరులకు అప్పగించాడో నీచపు భర్త. మనసారా మనుమాడిన భార్యను మరో ఇద్దరికి అప్పగించి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు ఆ దుర్మార్గపు భర్త. గుంటూరు నగరంపాలెం పరిధిలో జరిగిన ఈ అవమానవీయ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు.

ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ మీరావలి అలియాస్‌ బాబు బెంగళూరులో ఉంటున్నాడు. అతడికి ఏటీ అగ్రహారానికి చెందిన మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల ఏటీ అగ్రహారానికి వచ్చిన షేక్‌ మీరావలితో మాట్లాడేందుకు ఈ నెల 17న భార్య బంధువులు వెళ్లారు. వారి మధ్య వివాదం జరగడంతో తనపై భార్య తరుఫు బంధువులు దాడి చేశారని బాబు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కాగా ఇద్దరం కలిసి ఉందామని, గొడవలు వద్దని, పోలీస్ స్టేషన్ లో కేసును వాపస్ తీసుకోవాలని అడగడానికి బాబు భార్య అతడి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త బాబుతోపాటు అతని స్నేహితులు రబ్బాని, సలీంలు కలిసి మద్యం తాగుతున్నారు. వివాదాలు వద్దని కేసులు విత్‌డ్రా చేసుకుని జీవనం సాగిద్దామని అడిగిన భార్యపై భర్త బాబు, అతని స్నేహితులు రబ్బాని, సలీం కలిసి రాక్షసుల్లా మీదపడి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బయటకు గెంటివేయడంతో రోడ్డుపై పడిపోయింది. కొద్ది సమయం తర్వాత గమనించిన ఆమె బంధువులు, స్థానికులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

‘కామ’ఖాకీ.. ఏ స్థితిలో దొరికిపోయాడంటే..!

Advertisement

Next Story