రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయిన భర్త..!

by srinivas |
రెండో అంతస్థు నుంచి దూకి పారిపోయిన భర్త..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కట్టుకున్న భార్యను కాదని, ప్రియురాలితో గుట్టుచప్పుడు కాకుండా కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఓ భార్య. అయితే, ఆమె నుంచి తప్పించుకునే క్రమంలో భర్త రెండు అంతస్థుల బిల్డింగ్ నుంచి దూకి తప్పించుకోవడం విశేషం. ఈ వింతైన ఘటన ఏపీ రాష్ట్రం తిరుపతిలోని పద్మావతి నగర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. చంద్రమౌళి అనే వ్యక్తికి ఇదివరకే వివాహం అయింది. కానీ, కట్టుకున్న భార్యను కాదని, ప్రియురాలితో దొంగచాటుగా కాపురం పెట్టాడు. ఆమెను తిరుపతిలోని పద్మావతి నగర్‌లో ఓ అపార్ట్ మెంట్‌లో ఉంచాడు.ఈ విషయం పసిగట్టిన అతని భార్య తెల్లవారుజామున బంధువులతో వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వాళ్లకు దొరికితే తన పనిఅయిపోతుందని భావించిన చంద్రమౌళి రెండస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి తప్పించుకుని పారిపోయాడు. అయితే, చంద్రమౌళి డబ్బుల ఆశ చూపి మహిళలను లోబర్చుకుంటాడని, ఇదివరకే కాల్ మనీ వ్యవహారంలో ఒకసారి అరెస్టు కూడా అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని చంద్రమౌళి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story