- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీ పేలుడు.. అంచనాకు అందని మృతుల సంఖ్య
దిశ, న్యూస్ బ్యూరో : లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన భారీ పేలుడులో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నేలకూలాయి. వందలాది మంది చనిపోయి ఉంటారని, ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గైడెడ్ మిసైల్ దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నా ఇంకా అధికారికంగా ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, కానీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ ద్వారా జరిగిన పేలుడు కాదని, ఎక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థం కారణంగా ఈ విస్ఫోటనం జరిగి ఉంటుందని ఆ దేశ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్ జనరల్ తెలిపారు.
ఈ దాడిలో ఆ దేశ ప్రధాని, భార్య, కుమార్తె, బంధువులు స్వల్పంగా గాయపడినట్లు ఆ దేశ ఎల్‌బీసీ టీవీ ఛానెల్ తెలిపింది. బీరూట్ నగరంలోని మధ్యభాగంలో ఈ పేలుడు జరిగినట్లు అల్ జజీరా టీవీ పేర్కొంది. బీరూట్ పోర్టులో బాణసంచా లోడుతో ఉన్న నౌకలో జరిగిన పేలుడే ఈ నష్టానికి కారణమని ఆ దేశ ఆరోగ్య మంత్రి మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా ఆ దేశ సెక్యూరిటీ విభాగం ప్రతినిధులు మాత్రం పోర్టులో ఉన్న పాతకాలం నాటి పేలుడు పదార్థాల కారణంగానే ఈ విస్ఫోటనం జరిగినట్లు తెలిపారు.
ఆ కేసు తీర్పుకు ముందే..
ఆ దేశ మాజీ ప్రధాని రఫీక్ హరిరిని 2005లో హత్య చేసిన కేసుకు సంబంధించి శుక్రవారం ఐక్యరాజ్య సమితి ట్రిబ్యునల్ తీర్పును వెలువరించడానికి ముందు ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది. వందలాది మంది మరణించి ఉంటారని, పేలుడుకు కుప్పకూలిన భవనాల శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో ఇప్పుడే తెలియడం సాధ్యపడదని, తీవ్రంగా గాయపడిన వందలాది మందిని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు జార్జెస్ కెట్టానే మీడియాకు తెలిపారు. పేలుడు ధాటికి చాలా భవనాలు కూలిపోయాయని, కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించిన ప్రకంపనలతో మరికొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని స్థానిడుకు నదా హంజా అల్ జజీరా వార్తా సంస్థకు తెలిపారు. దాదాపు బీరూట్ నగరం మొత్తం పేలుడు ధాటికి దెబ్బతిన్నట్లు తెలిపారు. దట్టమైన పొగతో పాటు శక్తివంతమైన మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయని, కిటికీలు, తలుపులు గాల్లోకి ధూళికణాల్లాగా ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు.
భారతీయ పౌరులకు ప్రత్యేక హెల్ప్ లైన్..
బీరూట్ నగరంలో ఉన్న భారతీయ పౌరులకు సంబంధించి అక్కడి దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని, ఆందోళన చెందవద్దని, ఏ రకమైన సహాయం కావాలన్నా +96176860128, 01741270, 01735922, 01738418 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.