అనాథాశ్రమాలకు ఆహారం పంపిణీ

by Shyam |
అనాథాశ్రమాలకు ఆహారం పంపిణీ
X

దిశ, హైదరాబాద్ :

రాష్ట్రంలోని అన్ని అనాథాశ్రమాలకు ఆహార పదార్థాలు అందజేసేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలివ్వాలని కోరిన బాలల హక్కుల సంఘం పిటిషన్‌కు మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దాతలపై ఆధారపడుతున్న ఆశ్రమాల్లోని పిల్లలు.. సరైన ఆహార నిల్వలు లేక పస్తులుంటున్నారని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అనాథాశ్రమాలకు ప్రభుత్వమే ఉచితంగా ఆహారం అందించేలా ఏర్పాటు చేయాలని కమిషన్‌ను కోరారు. ఈ పిటిషన్‌కు హెచ్ఆర్సీ సానుకూలంగా స్పందించి, రాష్ట్రంలోని అన్ని అనాథాశ్రమాల్లోని నవజాత శిశువులకు పాల పొడి, ఆహారం అందించాలని హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్, సివిల్ సప్లయ్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేరాజన్ అనాథ ఆశ్రమాలకు ఆహారం పంపిణీ చర్యలకు శ్రీకారం చుట్టారు. కాగా, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Corona Effect, Orphan Homes, Child Rights Association, HRC

Advertisement

Next Story

Most Viewed