- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసాయనాలు లేకుండా మ్యాగీ మసాలా.. తయారు చేసుకోండిలా!
ప్రకటనల్లో చెప్పినట్లుగా రెండు నిమిషాల్లో కాదు కానీ, ఐదు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ అంటే ఇష్టపడనివారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలాగూ వర్షాలు పడుతున్నాయి. ఒకరోజు మిరపకాయ బజ్జీలు, రెండో రోజు చిల్లు గారెలు చేసుకున్నా.. మూడో రోజు తినడానికి ఏదో ఒకటి కావాలి కదా! ఆ లోటును మ్యాగీతో పూడ్చేయొచ్చు. కానీ లాక్‌డౌన్ కారణంగా దుకాణాల్లో మ్యాగీ స్టాక్ అయిపోయింది. సరఫరా కూడా తక్కువగా ఉంది. ఒకవేళ ఇంట్లో ఉన్నా అది ఎప్పటిదో అయ్యుంటుంది. కాబట్టి దానిలో ఉండే మసాలా ఘాటు తగ్గి ఉండొచ్చు. అంతేకాకుండా మ్యాగీలో వచ్చే మసాలాను ఒక ప్యాకెట్ వేస్తే తక్కువవుతుంది, రెండు ప్యాకెట్‌లు వేస్తే ఎక్కువవుతుంది. కాబట్టి ఇంట్లోనే ఆ మ్యాగీ మసాలా తయారుచేసుకోగలిగితే ఏ సమస్యా ఉండదు. అదే మసాలాను మామూలు స్పాగెట్టీతో కూడా ఉపయోగించి నూడిల్స్ చేసుకోవచ్చు. మరి దాని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా?
ఇప్పుడు చెప్పుకోబోయే మ్యాగీ మసాలా తయారీ విధానాన్ని మాజీ మాస్టర్‌చెఫ్ రన్నరప్ నేహా దీపక్ షా.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. సులభంగా తయారుచేసుకోగల ఈ మసాలాను చిప్స్, ఫ్రైస్, ఉల్లిరింగులు, బజ్జీలు, మోమోలతో కూడా తినవచ్చు. దీనికోసం కావాల్సిన పదార్థాలు 4 టీ స్పూన్‌ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 టీ స్పూన్‌ల వేయించిన ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ కారం, ముప్పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఆమ్‌చూర్ పొడి, పావు టీ స్పూన్ మెంతి పొడి, రెండు చిటికెల జాజికాయ పొడి, ముప్పావు టీ స్పూన్ ఎండిన అల్లం పొడి, పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, పావు టీ స్పూన్ నిమ్మ ఉప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉల్లిపొడి, ఒకటింపావు వెల్లుల్లి పొడి, పావు టీ స్పూన్ గరం మసాల, చిటికెడు సోంపు. వీటన్నింటినీ ఒక గిన్నెలో మిక్స్ చేసుకుంటే మ్యాగీ మసాలా రెడీ!