- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న పిల్లలకు కరోనా సోకినట్లు తెలుసుకోవడం ఎలా.?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలంగాణలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతన్నాయి. కావున ప్రజలు, పెద్దలు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు కరోనా సోకినట్లు ఎలా గుర్తించాలి.. అనే దానిపై నిజామాబాద్‌లో శ్రీ మహాలక్ష్మి చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ జి. హరికృష్ణ.. 24X7 హెల్ప్ లైన్ 83691 – 41928 నెంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు.
తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా చేపట్టాలి, చిన్నపిల్లల్లో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయితే ఏం చేయాలి. తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు నిర్ధారణ అయితే పిల్లలకి టెస్టులు చేయాలా, చిన్నపిల్లల విషయంలో డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి. కరోనా పాజిటివ్ లేదా అనుమానిత తల్లులకు జన్మించిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చా మొదలగు.. అనుమానాలపై పైన తెలిపిన హెల్ప్ లైన్ నెంబర్ వినియోగించుకోవచ్చని అన్నారు.
డాక్టర్‌తో డైరెక్ట్‌గా వీడియో కాల్‌లో మాట్లాడవచ్చని తెలిపారు. వాంతులు, విరేచనాలు తలనొప్పి స్పృహ కోల్పోవడం, ఉన్నట్టుండి చర్మంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడటం, వేలి గోర్లు లేదా బొటనవేలు నీలి రంగులో మారటం ఇవన్నీ కరోనా సెకండ్ వేవ్‌కు ఉదాహరణలు అని తెలిపారు. కరోనా అనుమానితుల పిల్లల తల్లితండ్రులు అశ్రద్ద చేయకుండా వెంటనే హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలి అని, హోం క్వారంటైన్ నుండే వీడియో కాల్ చేయవచ్చని డాక్టర్ జి.హరికృష్ణ తెలిపారు.