- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గొంతు నొప్పికి చెక్ పెట్టండి ఇలా..
దిశ,వెబ్‌డెస్క్ : కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ సీజనల్ వ్యాధుల వలన మనం అనారోగ్యపాలవుతాం. కొంచెం జలుబు, దగ్గు వచ్చినా భయానికి గురవుతాము. ఇక ఇలాంటి సమయంలో కాస్త గొంతుమంట కూడా వస్తుంది. అయితే గొంతు మంటగా ఉంటే చాలా మంది కరోనానేమో అని కంగారు పడుతుంటారు. అయితే వాతావరణ మార్పుల వలన వచ్చే గొంతు మంటకు మనం ఏ విధంగా చెక్ పెట్టాలో చూద్దం.
గొంతులో మంటగా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
- చల్లటి ద్రవం తీసుకోకూడదు
- రోజు ఉదయం గోరు వెచ్చటి నీరుతాగాలి
- చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి
- తగినంత విశ్రాంతి తీసుకోవాలి
- మిల్క్ షేక్స్, చికెన్ బ్రాత్ వంటివి కూడా సోర్ థ్రోట్ నుండి రిలీఫ్ కలుగ చేస్తాయి.
- గొంతు మంటకి స్మోకింగ్, వేపింగ్ కూడా మంచివి కావు. కాబట్టి, స్మోకింగ్‌ని ఎవాయిడ్ చేయడం, అలాగే సెకండరీ స్మోక్ కి దూరంగా ఉండడం అవసరం.
- ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, నాలుగైదు మిరియాలు వేసుకొని వాటిని ఉడకబెట్టి ఆ వేడి కషాయాన్ని తాగితే గొంతులో ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
- అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని వేడినీటిలో మరిగించి అనంతరం ఆ వేడి అల్లం నీటిలో కాస్త తేన వేసి తాగితే కూడా గొంతు నొప్పికి మంచి ఉపశమనం లభిస్తుంది
హెర్బల్ టీ..
అల్లం టీ, గ్రీన్ టీ, వంటివి తీసుకోవడం వలన గొంతు మంట సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. అల్లం టీ, లవంగాల టీ, కషాయం వంటివి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరిగి త్వరగా గొంతు మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉప్పు నీటితో పుక్కిలి పట్టడం..
ఉప్పు యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్, ఇన్‌ఫెక్షన్‌నీ కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి పుక్కిలి పట్టండి. ఇలా చేయడం వలన వాతవరణ మార్పుల వలన వచ్చే అనారోగ్య సమస్యలు గొంతలో మంట అనేది త్వరగా తగ్గుతుంది.
పసుపు..
పసుపు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండటానికి పాలలో కొద్దిగ పసుపు వేసుకోని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఉదయం గోరు వెచ్చటి నీటిలో కాస్త పసుపు వేసుకొని తాగిన మంచి ప్రయోజనాలు ఉంటాయి.