ఫేస్‌బుక్ పోస్టులను బల్క్‌గా డిలీట్ చేయడమెలా?

by vinod kumar |   ( Updated:2020-06-03 07:09:25.0  )
ఫేస్‌బుక్ పోస్టులను బల్క్‌గా డిలీట్ చేయడమెలా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫేస్‌బుక్‌లో ఏరోజుకారోజు పోస్టులు వచ్చిపడుతూనే ఉంటాయి. అయితే మనకు నచ్చనవి ఒక్కొక్కటిగా డిలీట్ చేయాలంటే చాలా కష్టమైనే పనే. అందుకని ఒకేసారి బల్క్‌గా పోస్టులు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తే ఓ పనైపోతుంది. అయితే ఇలాంటి ఫీచర్ ఇంతకుముందు ఫేస్‌బుక్‌లో లేదు. ఈ క్రమంలో యూజర్ల కన్వీయంట్ కోసం ఫేస్‌బుక్.. గతవారమే సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీంతో ఎప్పటికప్పుడు నచ్చని పోస్టులను డిలీట్ చేయొచ్చు లేదా హైడ్ కూడా చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను క్లీన్ చేసేందుకు ఓల్డ్ పోస్టులను డిలీట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

1. ప్రొఫైల్ పేజీలో ‘యాక్టివిటీ లాగ్’ కు వెళ్లాలి.
2. మేనేజ్ యాక్టివిటీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫిల్టర్స్, ఆర్చివ్స్ ఆప్షన్స్ మధ్యలో ఈ ‘మేనేజ్ యాక్టివిటీ’ ఉంటుంది.
3. పోస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
4. ఇప్పుడు ‘ఫిల్టర్స్’ పై ట్యాప్ చేయాలి.
5. ఇక్కడ మొత్తం పోస్టులను చూసుకునే అవకాశం ఉంటుంది లేదా స్పెసిఫిక్ పోస్ట్ (టెక్స్ట్ అప్‌డేట్స్, చెక్ ఇన్స్, ఫోటోస్, వీడియోస్) లను మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.
6. ఇప్పుడు పోస్ట్‌లను ఎంపిక చేసుకుని హైడ్ చేయాలనుకుంటే.. ఆర్చివ్‌పై క్లిక్ చేయాలి.
7. డిలీట్ చేయాలనుకుంటే.. ట్రాష్‌పై ట్యాప్ చేయాలి. ట్రాష్‌లో మనం డిలీట్ చేసిన పోస్ట్‌లు 30 రోజుల వరకు ఉంటాయి.

Advertisement

Next Story