Today's Horoscope : ఈరోజు రాశిఫలాలు

by samatah |   ( Updated:2023-08-11 18:45:12.0  )
Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
X

మేష రాశి : నేడు ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులు మీరు చేసే ఖర్చుల పట్ల, మీ జీవితం పట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీపై కోపానికి గురి అయ్యే అవకాశం ఉంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఈరోజు మీరు సమయాన్ని చాలా వృధా చేస్తారు. దీని వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక బంధంలో కలతలు ఏర్పడవచ్చు.

వృషభ రాశి : వ్యాపారాభివృద్ధికొరకు మీరుకొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.మీ దగ్గరివారినుండి మీకు ఆర్ధికసహాయము అందుతుంది. ఆర్థిక సంబంధమయిన విషయాలకు సంబంధించి, మీకుతెలిసిన ఒకరు అతిగా స్పందించి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. నేడు మీరు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

మిథున రాశి :ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ప్రతిసారి మీప్రేమను చూపించటం సరైనపద్ధతి కాదు.కొన్నిసార్లు ఇది మీసంబంధాన్ని దెబ్బతీస్తుంది. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. స్నేహితులతో ఉన్నపుడు మీరు హద్దుదాటి జోకులువేయవద్దు.ఇదిమీయొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ధనము ఏసమయములోనైనా అవసరము రావచ్చును కావున వీలైనంతవరకు పొదుపుచేయండి. శ్రీమతి, మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నాకానీ, సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. మీ గతపరియస్థులలో ఒకవ్యక్తి మిమ్ముల్ని కలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

సింహ రాశి : నేడు ఈరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్ మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇండోర్, అవుట్ డోర్ ఆటల్లో పాల్గొని సంతోషంగా ఉంటారు. మీరు చాలా రోజులుగా అనుభవిస్తున్న ఒత్తిడిని మీ మిత్రులకో లేదా బంధువులకో చెప్పడం ద్వారా మనుసు తేలికపడుతుంది.

కన్యా రాశి :మానసిక స్పష్టత కోసంగాను, అయోమయం, నిరాశ నిస్పృహలను దగ్గరకు రానీయకండి. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో ,సమయాన్ని ఎలాసద్వినియోగించుకోవాలో తెలుసుకోండి.ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

తుల రాశి : ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సోదరులు, ఆత్మీయుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయాన్ని వృథా చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు పనులలో జాప్యం జరగవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదల, విశ్వాసంతో పనులు చేస్తారు. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది.

వృశ్చిక రాశి : నేడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తారో వారికి ఈరోజు చాలా మంచిరోజుగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. నేడు ఆఫీసులో మీ సందడే కనిపిస్తుంది.కానీ మీరు అనుకోకుండానే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

ధనస్సు రాశి :పనులలో అదృష్టం కలిసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పాతబాకీలు కొంతవరకు వసూలు అవుతాయి. నూతన ఉద్యోగంలో చేరవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.

మకర రాశి : ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వలన అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ బంధువులతో ఉన్న తగాదాలు తొలిగిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

కుంభ రాశి :ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. పై చదువులకు ఈ వారం అనుకూలం. ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహిస్తారు. నియమాలకు లోబడి పనులు చేస్తారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

మీన రాశి : అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం సజావుగా సాగుతుంది. సోదరులు, స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి. రాబడికి తగ్గ ఖర్చులూ ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించడం కన్నా.. చేతిలో ఉన్నవాటిని పూర్తిచేయడంపై దృష్టి సారించండి.

Advertisement

Next Story