నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం

by samatah |   ( Updated:2023-04-05 18:45:16.0  )
నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం
X

మేష రాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు.ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థి నెలకొంటుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా, కుటుంబ విషయాలపై ఆసక్తి చూపరు. మీరు డబ్బును అతిగా ఖర్చుచేయడం వలన అవసరానికి డబ్బు చేతికందదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వృషభరాశి : ఈరోజు ఈ రాశి వారు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతారు.ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.విద్యార్థులు కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. ఈరాశి వారికి నేడు మొత్తం సానుకూలంగా ఉంటుంది.

మిథున రాశి : ఈ రోజు మీ కుటుంబసభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో డబ్బుకంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తనవలన ఇబ్బంది పడతారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరైతా చాలా రోజుల నుంచి రుణసదుపాయం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కలిసి వస్తుంది.

కర్కాట రాశి :గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. ఈరోజు ఇంటిపెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీరుఅనుకున్నట్టు కుటుంబపరిస్థితి ఉండదు.ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి.

సింహ రాశి : ఒక యోగివంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాయిని పొందుతారు. ఈరాశివారు ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యలమీద ఖర్చుచేస్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు నేడు దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి లాభదాయకంగా ఉంటాయి.

కన్యా రాశి : ఈ రాశి వారికి నేడు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంట్లో పట్టించుకోనితనం, ఆఫీసులో పని ఒత్తిడి అలసటకులోనయ్యేల చేస్తుంది. రోజు మొత్తం చాలా నీరసంగా గడుపుతారు. ఈ రోజు మీ కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం లేకపోతే పెద్ద సమస్యలకు కారణమవుతాయి. నేడు మీ జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు కలిసి వస్తుంది.

తుల రాశి : ద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు.చేపట్టిన పనులు విజయవతంగా పూర్తవుతాయి. ఈరోజు మొత్తం ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.


వృశ్చిక రాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభదాయంగా ఉంటాయి. వాటి వలన మీకు అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మీతో ఆనందంగా గడుపుతుంది. ముఖ్యమైన పనులు త్వరగా నెరవేరుతాయి.

ధనస్సు రాశి : కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులయొక్క సహాయసహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని అనివార్యకారణముల వలన మీరు చేపట్టిన పనులుమధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది.

మకర రాశి : వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పారిశ్రామిక వేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సమయం ప్రోత్సాహకరంగా ఉంది. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే. సేవాభావంతో పనులు చేస్తారు.

కుంభ రాశి : ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఒక శూభవార్త అందే అవకాశమున్నది. అది మిమ్మల్నే కాదు, కుటుంబాన్నంతటినీ ఊపేస్తుంది. మీ ఆతృతను అదుపులో ఉంచుకొండి. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


మీన రాశి : ఈ రోజు మొత్తం మీరు చాలా హుషారుగా గడుపుతారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పట్టుదలతో పనులు చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.దూర ప్రయాణాలు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులున్నీ నెరవేరుతాయి.

Advertisement

Next Story