- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తట్టుకోలేకనే అశాంతి సృష్టిస్తున్నారు : సుచరిత
దిశ, ఏపీబ్యూరో : రాష్ర్టంలో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే ప్రతిపక్షం అశాంతి సృష్టిస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా కులమతాల మధ్య అల్లర్లు సృష్టించేందుకు విపక్షం పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పేదోళ్లకు సొంతింటి కల నెరవేర్చాలనేది సీఎం జగన్సంకల్పమని చెప్పారు. ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించడం చరిత్రలో నిల్చిపోతుందన్నారు. ఇందు కోసం భూములు కొనివ్వడం రాష్ర్ట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఆమె కొనియాడారు.
రాష్ర్టంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్ పేరేచర్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిపక్ష నేత కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని ధ్వజమెత్తారు. పేరేచర్ల లేఅవుట్ను మోడల్ లేఆవుట్గా తీర్చిదిద్దుతామని, రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు. నవరత్నాల్లో ప్రధానమైన పథకం ఇళ్ల పట్టాల పంపిణీయేనని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలను వైఎస్ జగన్ చూశారని, ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన అని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల ద్వారా ఆస్తి హక్కు కల్పిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంలోనే అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు కులమతాల పేరుతో గొడవ చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మోపిదేవి ధ్వజమెత్తారు.