'రానున్న రోజుల్లో వీటికే అధిక డిమాండ్.. ఈజీగా భారీగా డబ్బులు సంపాదించుకోవొచ్చు'

by Sridhar Babu |   ( Updated:2021-11-30 05:55:29.0  )
Chiru-Dhanyalu1
X

దిశ, అచ్చంపేట: రానున్న రోజులలో చిరుధాన్యాలకే అధిక డిమాండ్ ఉంటుందని అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో ఐసీఐసీఐ ఫౌండేషన్ వారు రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి గ్రామ సర్పంచ్ శ్రీరామ్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే అత్యధికంగా డయాబెటిస్ కలిగినవారు అధికంగా ఉన్నారని, అందుకు మందులతో తయారైన ఆహారాన్ని తీసుకోవడమే కారణమన్నారు. కావున ఐసీఐసీఐ పౌండేషన్ ఉచితంగా కొర్రలు, అరికెలు విత్తనాలను సరఫరా చేస్తున్నారని, వాటిని పండించినట్లయితే మార్కెట్ సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు.

నిత్యం రైతులు వరి పత్తి వేరుశెనగ లాంటి పంటలనే కాకుండా చిరుధాన్యాలు రాగులు, జొన్నలు, కొర్రలు, అరికెలు.. వీటిపై దృష్టి కేంద్రీకరించాలని పై పంటలకు రానున్న రోజుల్లో అధిక డిమాండ్ ఉంటుందని గుర్తు చేశారు. అంతకుముందు ఐసీఐసీఐ ఫౌండేషన్ డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ చిరుధాన్యాల సేద్యం చేయటానికి రైతులకు మద్దతుగా పూర్తి సహకారం విత్తనాలను అందజేస్తామని తెలిపారు. అలాగే రైతులకు పూర్తిస్థాయిలో లాభం చేకూరుతుందని, తద్వారా కాలుష్య నియంత్రణ జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు సిరిధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారని పల్లె ప్రజలు కేవలం వరి ఆహారంపై ఆసక్తి చూపుతున్నారని, వీటికి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయం చిరుధాన్యాల వ్యవసాయం చేశారని తద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని సర్పంచ్ ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆర్గనైజర్లు అంతయ్య ఏఈఓ సీతారాం నాయక్, శ్యామ్, రైతులు, పాల్గొన్నారు.

Advertisement

Next Story