- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. యాజమాన్య కోటాలో 30 శాతం వరకు సీట్ల భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో పాటు యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్ చూస్తారనే నిబంధనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను వర్తింపజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని హైకోర్టు పేర్కొంది. యాజమాన్య కోటాను కన్వీనర్ భర్తీ చేస్తామన్న ప్రభుత్వ నిబంధనపై రాయలసీమ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవో.55ని జారీ చేసింది. దీని ప్రకారం 30 శాతం సీట్లు యాజమాన్య కోటా కింద భర్తీ చేయాలి. యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్ ఆధ్వర్యంలో భర్తీ చేస్తామనడం సరికాదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని కోర్టులో వాదించారు.
పిటిషనర్ల తరపున న్యాయవాదులు శ్రీవిజయ్, వేదుల వెంకటరమణ, వీరారెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. యాజమాన్య కోటా కింద సీటు పొందిన విద్యార్థి మూడొంతులు ఎక్కవ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీరికి ప్రభుత్వ పథకాలు అమలు కావని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ పిటిషన్లు విచారణకు అర్హత లేదని వాదించారు. విద్యార్థులకు యాజమాన్య కోటా సీట్లు ఎంపిక చేసుకొనేందుకు వెసులుబాటు మాత్రమే కల్పిస్తామని, పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని వాదించారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే రోజుల్లో 9-12 తరగతులకు కూడా ఆన్‌లైన్ అడ్మిషన్ విధానాన్ని తీసుకొచ్చి అక్కడా యాజమాన్య కోటా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేస్తారా? అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.