- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ భార్య ఫోన్‌కాల్ రికార్డు చేస్తున్నారా.. ఇది మీ కోసమే..!
దిశ, డైనమిక్ బ్యూరో: భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేసుకొని అప్పడప్పుడూ వింటుండటం చూస్తుంటాం. ప్రేమికులైతే మొదటి నుంచి వారు చేసుకున్న మెసేజ్‌లను చదువుతూ తెగ మురిసిపోతుంటారు. ఇదంతా సరే.. మ్యాటర్ ఏంటీ అంటారా?.. ఇలా కాల్ రికార్డు చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. నా భార్యతో మాట్లాడుతుంటే రికార్డు చేస్తే తప్పెందుకు అవుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కట్టుకున్న భార్య అయినా ఆమె అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్-హర్యానా కోర్టు వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని భటిండాలో ఓ వ్యక్తి తన భార్య వేధిస్తోందని విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. భార్య వేధించిందన్న దానికి సాక్ష్యం ఉందా అని కోర్టు అడుగగా.. భార్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను కోర్టుకు సమర్పించారు. ఫ్యామిలీ కోర్టు రికార్డింగ్స్‌ను సాక్ష్యంగా పరిగణించడంతో.. భార్య హైకోర్టును ఆశ్రయించింది. మాట్లాడే వ్యక్తికి తెలియకుండా రికార్డు చేయడం చట్ట విరుద్ధమని.. ఇది ముమ్మాటికీ గోప్యత హక్కును ఉల్లంఘించడమేనిని కోర్టు తేల్చి చెప్పింది.
రికార్డింగ్స్‌ను పరిగణలోకి తీసుకోలేమన్న హైకోర్టు.. ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అంతేకాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో గోప్యత హక్కు ముఖ్యమైనదిగా గుర్తించారని.. ఈ క్రమంలో భార్య, భర్త ఫోన్ కాల్ సంభాషణనే కాదు ఎవరి కాల్స్‌ను అనుమతి లేకుండా రికార్డింగ్ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
మీరు ఇతరులతో సెక్స్ చేయట్లేదా?.. సన్నీ లియోన్ ఫైర్
- Tags
- Crime News Today