న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆగ్రహం

by Anukaran |
న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను చూసి సుమోటాగా గురువారం హైకోర్టు విచారించింది. కొత్త వైరస్ మోర్ డేంజర్ అంటుంటే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యూ ఇయర్ వేడుకలకు పబ్‌లు బార్‌లు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఏం చేయాలి అనుకుంటున్నారని ప్రశ్నించింది.

రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వేడుకలు ఇప్పటికే బ్యాన్ చేశారని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధర్మాసనం మండిపడింది. అయితే కరోనా దృష్టిలో ఉంచుకుని వేడుకలు జరపకూడదని ప్రజలకు సూచించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నేడు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించాలని పేర్కొంది. వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదిక జనవరి 7వ తేదీన సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

Next Story

Most Viewed