స్కూల్‌ వాతావరణం చెడగొడతారా.. ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఫైర్

by srinivas |
స్కూల్‌ వాతావరణం చెడగొడతారా..  ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: కోర్టు ధిక్కార కేసులో ఏపీకి చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌లు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై సోమవారం విచారణ జరిగింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పేద పిల్లలు చదువుకునే స్కూల్‌లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారు అని హైకోర్టు జడ్జి దేవానంద్ నలుగురు అధికారులను ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు తీసుకెళ్తారా అంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఏజీ కోర్టుకు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed