హీరోయిన్లు అది పెంచితే తప్పేంటి.. ? – నటి

by Shyam |   ( Updated:2021-07-01 02:24:12.0  )
tapesse news
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఝమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తాప్సీ పన్ను. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వివాదాలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వివాదమైన విషయానికి మద్దతుగా నిలిచింది. ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ మాత్రమే ఎందుకు ఉండాలని ప్రశ్నించిన తాప్సీ తాము కూడా రెమ్యూనిరేషన్ పెంచడంలో తప్పేంటని ప్రశ్నించింది. ఇటీవల ‘సీత’ పాత్రకు కాను బాలీవుడ్ భామ కరీనా కపూర్ 12 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి అందర్నీ షాక్ గురిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో తాప్సీ, బెబో బ్యూటీకి మద్దతుగా నిలిచింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న తాప్సీ ఈ విషయమై తన అభిప్రాయం వ్యక్తపరిచింది.

“కరీనా దేశంలోనే అతి పెద్ద ఫిమేల్ సూపర్ స్టార్లలో ఒకరు. ఆమె తాను చేస్తున్న పనికి జీతం అడగడంలో తప్పు లేదు.. ఒక హీరో తన పారితోషికాన్ని పెంచినప్పుడు ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదు. అభ్యంతరాలు లేవు.. కానీ ఒక హీరోయిన్ అలా చేసేటప్పుడు ఎందుకు అంత రచ్చ చేస్తారు? అనేది నాకు అర్థం కావడం లేదు.. మరి మీరనుకుంటున్న స్టార్ హీరోలు భారీ పౌరాణిక చిత్రాలల్లో ఫ్రీగా నటిస్తున్నారా..? అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం తాప్సీ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం తాప్సీ ‘హసీనా దిల్ రుబా’ అనే చిత్రంలో కనిపించనుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Next Story