- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాట్సప్‌లో నెంబర్ సేవ్ చేసుకోకుండానే అలా చేయెచ్చు తెలుసా..
దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ సర్వీస్‌లో వాట్సాప్ ఒకటి. భారత్‌లో 400 మిలియన్ కంటే ఎక్కువ మందిని సందేశాలతో కనెక్ట్ చేస్తున్న ఈ యాప్ వాడటం సులువే కానీ.. ఇందులో యూజర్స్‌కు తెలియని, ఉపయోగించని ట్రిక్స్ ఎన్నో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ‘కాంటాక్ట్’ సేవ్ చేయకుండా చాట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలా చేయడం ఎంతోమందికి సవాల్‌గా ఉంటుంది. పరిచయాల జాబితాలో చేరాల్సిన అవసరం లేకుండానే చాట్ ఎలా చేయాలంటే?
వ్యక్తులతో పరిచయముంటే కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం. అలాగని ప్రతీ వ్యక్తి నంబర్ సేవ్ చేసుకోలేం కదా. అంతేకాదు కొందరితో కొద్ది నిమిషాలే పని ఉంటుంది. ఆ మాత్రం దానికి తన పేరును కాంటాక్ట్ లిస్ట్‌లో యాడ్ చేసి, మళ్లీ డిలీట్ చేయడాన్ని ఒక పెద్ద పనిగా భావిస్తుంటాం. ఉదాహరణకు మన అడ్రస్ లొకేషన్ కావాలనుకునే డెలివరీ వ్యక్తి కావచ్చు లేదా బైక్ అమ్మేందుకు ఫొటోలు పంపిన వ్యక్తి కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో వినియోగదారులు ఇంటర్నెట్ బ్రౌజర్ ద్వారా WhatsApp క్లిక్ టు చాట్ ఫీచర్‌ను ఉపయోగించి నంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేయవచ్చు. ఏదైనా యాక్టివ్ WhatsApp ఖాతాతో సంభాషణను ప్రారంభించడానికి ‘క్లిక్ టు చాట్ ఫీచర్’ wa.me షార్ట్‌కట్ లింక్స్ ఉపయోగిస్తుంది.
నంబర్‌ను సేవ్ చేయకుండా వాట్సాప్ చాట్ ఎలా ప్రారంభించాలి?
* మీకు నచ్చిన బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి.
* https://wa.me/phonenumber అనే అడ్రస్‌ను సందర్శించాలి(గమనిక : మీరు ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో చాట్ చేయాలనుకుంటున్న రిజిస్టర్డ్ WhatsApp మొబైల్ నంబర్‌ను ఈ ఫార్మాట్‌లో జోడించాలి : https://wa.me/919734652818. ఇండియన్ యూజర్స్ అయితే కంట్రీ కోడ్ 91 కూడా జోడించాలి.)
* పేజీని సందర్శించిన తర్వాత వెబ్‌సైట్‌కు మళ్లిస్తుంది.
* ఆ తర్వాత మీరు నమోదు చేసిన నంబర్‌తో చాట్ ప్రారంభించేందుకు బటన్‌పై క్లిక్ చేయాలి.
మీ లిస్ట్‌లో కాంటాక్ట్‌ను సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే Android, iOS పరికరాల్లో రిజిస్టర్డ్ WhatsApp నంబర్‌కు మెసేజ్ చేయడానికి వినియోగదారులు ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు.