గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా..? అయితే డేంజర్‌‌లో ఉన్నట్లే జాగ్రత్త!

by karthikeya |   ( Updated:2024-09-22 14:55:27.0  )
గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా..? అయితే డేంజర్‌‌లో ఉన్నట్లే జాగ్రత్త!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వాళ్ల సంఖ్య ఎంత పెరిగిపోయిందో వేరే చెప్పక్కర్లేదు. కానీ దీనివల్ల ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా గంటల తరబడి కుర్చీల్లో అలాగే కూర్చుని పని చేయడం వల్ల మన ఆరోగ్యానికి మనమే ఏరికోరి నష్టం కలిగించుకుంటున్నాం. ఆరోగ్య నిపుణులు అధ్యయనాలు చేసి మరీ చెబుతున్న మాట ఇది. కుర్చీపై లాంగ్ టైం కూర్చుని పని చేయడం వెన్ను, మెడ నొప్పి వస్తుంది. వెన్నెముకపై ఒత్తిడి పెరగడం, భుజాలలో దృఢత్వం క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. సుదీర్ఘకాలం అలాగే పని చేయడం వల్ల ఈ అనారోగ్యాలు శాశ్వత సమస్యగా మారతాయి. ఇక ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు ఖర్చు కావడం తగ్గిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ సమస్య పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, అలసట, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయి. దీనివల్ల లైఫ్ స్టైల్, మెంటాలిటీపై కూడా దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.

బయటపడాలంటే ఎలా..?

సగటు వ్యక్తి పని చేస్తున్నప్పుడు ప్రతి అరగంటకు 5 నుండి 10 నిమిషాలు విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అలసట తగ్గుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం కంపల్సరీ కాబట్టి 7, 8 గంటలు కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి క్వాలిటీ ఉన్న కుర్చీలో కూర్చోండి. ఇది మీ వెన్నెముకకు మంచి సపోర్ట్ ఇచ్చేలా ఉండేలా చూసుకోండి. అటు ఎత్తుగా, ఇటు కిందికి దిగబడి ఉండని కుర్చీలను ప్రిఫర్ చేయండి. కుర్చీలో కూర్చుంటే మీ అరికాళ్ళు నేలను తాకేలా కుర్చీని సెట్ చేసుకోండి. పని చేసేటప్పుడు నీరు తాగుతూ ఉండడం అన్నింటికంటే ముఖ్యం. ఇది మీ జీవక్రియను మెరుగ్గా ఉంచడమే కాకుండా శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది. అలాగే జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న హెల్తీ ఫుడ్ తిన తినడానికి ట్రై చేయండి. ఇలాంటి కనీస నియమాలు పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు పై సమస్యల నుంచి కొద్దిగా రక్షించుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed