రాగి ఆభరణాలు ధరించడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-15 06:23:34.0  )
రాగి ఆభరణాలు ధరించడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రాగి ఆభరణాలు ధరించడం చాలా తక్కువ. ఎక్కువ మంది బంగారం, వెండి ఆభరణాలను ధరిస్తుంటారు. అయితే బంగారం, వెండే కాదండోయ్, రాగి ఆభరణాలు ధరించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వాటిలో ఉండే రాగి కొద్ది కొద్దిగా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.
  • డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, నెల‌స‌రి స‌మ‌స్య‌లు ఉన్న మ‌హిళ‌లు రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే మంచిది.
  • రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
  • రాగి ఆభరణాలు ధరించడం వలన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయంట.
Advertisement

Next Story

Most Viewed