బ్రెయిన్ ట్యూమర్ గుర్తించే 3 లక్షణాలు ఇవే!

by Jakkula Samataha |
బ్రెయిన్ ట్యూమర్ గుర్తించే 3 లక్షణాలు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ కేసులనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ కేసులు అధికం అవుతున్నాయి. దీని కారణంగా చాలా మంది తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. అందువలన ఈ బ్రెయిన్ ట్యూమర్స్‌ను గుర్తించే లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.తలనొప్పి : ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారో వారు నిరంతరం తలనొప్పిని ఎదుర్కొంటారంట. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయంలో తీవ్ర తలనొప్పి వస్తుందంట. కాస్త ఒత్తిడి ఎక్కువైనా నొప్పి తీవ్రత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అందువలన అతిగా తలనొప్పి వస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంట.

2. వాంతులు, తిమ్మిరి : కొన్నిసార్లు బ్రెయిన్‌ ట్యూమర్‌ వల్ల కొన్ని సార్లు వికారం, వాంతులు రావచ్చు. సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్‌ ప్రవాహాన్ని నిరోధించడం ద్వారా లేదా వాపుకు కారణమయ్యే ట్యూమర్‌ మెదడుపై ఒత్తిడి తెచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. వికారం, వాంతులు వస్తుంటే, ముఖ్యంగా తలనొప్పితో పాటు లక్షణాలు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా తల తిప్పినట్లుగా, తిమ్మరిగా అనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని వారు చెబుతున్నారు.

3. కంటి చూపుపై ప్రభావం : బ్రెయిన్ ట్యూమర్ వలన బాధపడుతున్నవారిలో కంటి చూపు మందగించడం లాంటిది జరుగుతుందంట.కంటి చూపు తగ్గడం, కొన్ని వస్తువులను చూడకపోవడం, కొన్ని రకాల కలర్స్ కనిపించకపోవడం, వంటి లక్షణాలు కనిపిస్తాయంట.

Advertisement

Next Story

Most Viewed