పసిపిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త!

by Jakkula Samataha |   ( Updated:2024-03-02 10:05:26.0  )
పసిపిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : పసి పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు వైద్యులు. ఇక చిన్న పిల్లలకు త్వర త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.అందువలన చాలా పసికందులు ఉన్నప్పుడు చాలా నీట్ నెస్ మెటైన్ చేయాలి. లేకపోతే వారు పదే పదే దగ్గు జలుబు లాంటి సమస్యల బారిన పడుతారు.

ఇక సీజన్ మారుతున్నప్పుడు పిల్లలకు త్వరగా జలుబు లేదా దగ్గు రావడం అనేది సహజం.దీంతో పిల్లలకు జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు మనం వెంటనే కంగారు పడిపోయి వైద్యులను సంప్రదిస్తుంటాము. వారు సిరప్ ఇస్తుంటారు. అయితే పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలంట.

పిల్లలకు దగ్గు సిరప్ ఇస్తున్నట్లయితే దగ్గు సిరప్ ముందు D అనే పదం లేకుండా చూసుకోవాలంట. ఎందుకంటే డీ అంటే డెక్స్ట్రోమెథార్ఫాన్ అని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇది ఇవ్వకూడదని చెబుతున్నారు వైద్యులు.ఎందుకంటే ఇలాంటి సిరప్ ఇచ్చిన ప్పుడు కొందరు పిల్లల్లో దగ్గు అస్సలే తగ్గదంట, దీని వలన కఫం పేరుకుపోయి, న్యూమోనియాకు దారితీస్తుందని చెబుతున్నారు వైద్యులు.

Read More..

పుట్టిన ఐదు రోజులకే పాపకు పీరియడ్స్.. షాక్‌లో వైద్యులు

.

Advertisement

Next Story

Most Viewed