- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్… ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ ఏడాది పండుగ సీజన్ కోసం వినియోగదారులకు భారీ స్థాయిలో ఆఫర్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వారి ‘ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 కార్యక్రమం ద్వారా 10,000 మంది కంటే ఎక్కువ మంది వ్యాపారులతో భాగస్వామ్యం చేసుకున్నామని హెచ్‌డీఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యం 2020 కంటే 10 రెట్లు అధికం కావడం విశేషం. ఇందులో భాగంగా బ్యాంకు కార్డు, రుణాలు, ఈఎంఐలపై 10,000 రకాల ఆఫర్లను వినియోగదారులు పొందుతారని బ్యాంకు పేర్కొంది.
‘దేశవ్యాప్తంగా కొవిడ్ భయాల నుంచి బయటపడి ప్రజలు కొనుగోళ్లను నిర్వహిస్తున్నారు. దీనివల్ల దేశీయంగా ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించనున్నాం. తాజాగా ప్రకటించిన ఆఫర్‌లో భాగంగా వ్యక్తిగత రుణాలు, కారు, టూ-వీలర్ రుణాలు, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలకు ప్రయోజనాలు అందించనున్నామని’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిటైల్ విభాగం హెడ్ అరవింద్ కపిల్ చెప్పారు. ఈ ఆఫర్లను వినియోగదారులకు చేర్చేందుకు యాపిల్, అమెజాన్, ఎల్‌జీ, శాంసంగ్, టైటాన్, అజియో, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, షాపర్స్‌స్టాప్ సహా పలు సంస్థలతో భాగస్వామ్యం చేసుకున్నామని అరవింద్ తెలిపారు. ‘భారత్‌లోని మొత్తం క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డుల కోసం చేసే ఖర్చుల్లో మూడింట ఒక వంతు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు ద్వారా జరుగుతున్నాయని, తాజా ఆఫర్ల ప్రకటన బ్యాంకును మరింత పటిష్టం చేయగలదని’ హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకిన్ విభాగానికి చెందిన పరాగ్ రావు వెల్లడించారు.