- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత ఖర్చుతో గ్రామస్తులకు వ్యాక్సిన్ వేయించిన సర్పంచ్
దిశ, సత్తుపల్లి: తమ గ్రామ ప్రజలు కోవిడ్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలని ఆ గ్రామ సర్పంచ్ సొంతంగా రూ.10 లక్షలు వెచ్చించి వ్యాక్సినేషన్ అందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గౌరిగూడెం గ్రామ సర్పంచ్ మందపాటి ముత్తారెడ్డి తన గ్రామ పంచాయతీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా రూ.10 లక్షల సొంత డబ్బులతో రెయిన్‌బో ఆస్పత్రి వైద్య బృందంతో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటివరకూ గౌరిగుడెం గ్రామంలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కాగా, రానున్న రోజుల్లో కూడా ఎటువంటి కేసులు నమోదు కాకూడదనే సంకల్పంతో సర్పంచ్ ముత్తారెడ్డి చేపట్టిన వాక్సిన్ కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
ఓ వైపు గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపడుతూనే మరో వైపు లక్షలు వెచ్చించి వాక్సిన్ వేయించడం ఆయనకు గ్రామ ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు, ప్రేమకు నిదర్శనం అన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి గ్రామస్తులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జెడ్పీటీసీ రామరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుల్ల కృష్ణయ్య, కౌన్సిలర్ కొత్తూరు ఉమమహేశ్వరరావు, టెక్స్ మో కృష్ణారెడ్డి, ఎం.పీ.ఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.