'ఘోరంగా విఫలమౌతున్నాయి'

by Shyam |
ఘోరంగా విఫలమౌతున్నాయి
X

దిశ, న్యూస్‌‌బ్యూరో: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో వలస కార్మికులు అనుభవిస్తున్న బాధలను, అసంతృప్తిని అంచనా వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమౌతున్నయన్నాయి. ప్రభుత్వాలు మేల్కొనకపోతే రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కందిలో వలస కార్మికుల ఆవేశము, ఆక్రోశాన్ని దేశ వ్యాప్తంగా చవి చూడాల్సి వస్తుందన్నారు. మనిషికి 10 కిలోల బియ్యం, రూ.500 ఇచ్చి తమ భార్య, బిడ్డలను మరిచి పొమ్మంటే ఎవరికీ సాధ్యము కాదన్న విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. వారిని అడ్డుకునే బదులు వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు.

Tags: Migration labor,Coronavirus, Lokdown, Government,congress,Niranjan

Advertisement

Next Story

Most Viewed