- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు: పీఆర్సీపై సజ్జల వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పీఆర్సీపై నీళ్లు చల్లేలా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంగళవారం సీఎస్ డా.సమీర్ శర్మ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. పీఆర్సీపై చర్చించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పీఆర్సీ ఇచ్చినా ఎక్కువగానే ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బీజేపీ విమర్శలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపించారు. తన అనుచరుల చేత చంద్రబాబు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.